Srikrishnadevarayulu : ప్రపంచానికి భారత్ శాంతిని ఇస్తే… పాకిస్థాన్ మాత్రం : లావు శ్రీకృష్ణదేవరాయులు
ప్రపంచానికి భారత్ శాంతిని ఇస్తే, పాకిస్థాన్ ఉగ్రవాద శిక్షణ క్యాంపులిచ్చిందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయులు (Srikrishnadevarayulu) అన్నారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పై లోక్సభ (Lok Sabha) లో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ అంటే కేవలం ప్రతీకారం కాదు. సంయమనం, కచ్చితత్వం, ఆర్మీ (Army) , నేవీ, ఎయిర్ఫోర్స్ (Air Force) కి దేశం తరపున నేను సెల్యూట్ చేస్తున్నా. ఉగ్రవాదంపై చర్చించొద్దు. ఉగ్రవాదాన్ని తుదముట్టిద్దాం. ఉగ్రవాదంపై పోరుకు భారత్ నాయకత్వం వహించాలి అని అన్నారు.






