Supreme Court:సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు…శ్రీకృష్ణుడే మొదటి రాయబారి
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం, శ్రీ బాంకే బిహారీ టెంపుల్ (Banke Bihari Temple) ట్రస్ట్ వివాదంలో సుప్రీంకోర్టు (Supreme Court) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శ్రీకృష్ణుడే మొదటి రాయబారి అని, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి యత్నించాలంటూ ఇరుపక్షాలకు సూచించింది. ఇందుకోసం ఒక కమిటీని ప్రతిపాదించింది. ఆలయ నిధుల నుంచి రూ.500 కోట్లతో కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తూ ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీనికి సవాల్ చేస్తూ కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణ సందర్భంగా శ్రీకృష్ణుడి రాయబారం గురించి సర్వోన్నత న్యాయస్థానం ప్రస్తావించింది. ఆర్డినెన్స్‌ను ఆమోదించడంలో తొందర ఎందుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీని రాజ్యాంగబద్ధతను పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) ను ఆదేశించింది.






