Supreme Court: సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు కొత్త జడ్జిల నియామకం

ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. బాంబే హైకోర్టు ప్ర ధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే (Justice Alok Aradhe) , పాట్నా హైకోర్టు సీజే జస్టిస్ విపుల్ మనుభాయ్ పంచోలీ (Vipul Manubhai Pancholi) లను సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమించాలని కోరింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice BR Gavai), జస్టిస్‌లు సూర్యకాంత్, విక్రమ్‌నాథ్, జేకే మహేశ్వరి, బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉండాలి. వీరిద్దరి నియామకంతో జడ్జిల సంఖ్య 34కు చేరుతుంది. జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి సీజేఐ పదవిని చేపడితే, 2031 మే నెలలో పదవీ విరమణ చేస్తారు. ఆయన తర్వాత సీజేఐగా జస్టిస్ పంచోలీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది.