Subhanshu Shukla :ప్రధాని మోదీతో శుభాంశు శుక్లా భేటీ

అంతరిక్ష కేంద్రం ( ఐఎస్‌ఎస్)లోకి వెళ్లి సురక్షితంగా వచ్చిన తొలి భారతీయ వ్యోమగామి, గ్రూపు కెప్టెన్ శుభాంశు శుక్లా (Subhanshu Shukla) ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi)తో భేటీ అయ్యారు. నాసా యాక్సియం-4 మిషన్‌ను ఇటీవల విజయవంతంగా పూర్తి చేసుకున్న శుక్లా స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. వ్యోమగాములు ధరించే ప్రత్యేక జాకెట్‌తో లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి ఆయన వచ్చినప్పుడు మోదీ స్వాగతం పలికి ఆప్యాయంగా హత్తుకున్నారు. భుజంపై చేయివేసి ఆయనతో కలిసి నడుస్తూ ముచ్చటించారు. తనతోపాటు ఐఎస్‌ఎస్ (ISS)కు తీసుకువెళ్లిన త్రివర్ణ పతాకాన్ని , యాక్సియం-4 మిషన్‌కు సంబంధించిన జ్ఞాపికను శుక్లా ఆయనకు అందజేశారు. రోదసి నుంచి జూన్ 29న ప్రధానితో శుక్లా ముచ్చటించినప్పుడు వెనుకవైపు ఇదే పతాకం రెపరెపలాడుతూ కనిపించింది. అంతరిక్షం నుంచి తాను తీసిన కొన్ని చిత్రాలను ట్యాబ్లెట్ కంప్యూటర్ (Computer)లో చూపిస్తూ వాటి గురించి శుక్లా వివరించారు. అంతరిక్ష అనుభవాలు, శాస్త్ర- సాంకేతిక రంగ పురోగతి, గగన్‌యాన్ మిషన్ వంటివాటిపై శుభాంశుతో చర్చించానని, ఆయన సాహసాన్ని చూసి దేశం గర్విస్తోందని మోదీ తెలిపారు.