ఉద్యోగులకు రూ. 6,210 కోట్లు విరాళం
శ్రీరామ్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఆర్ త్యాగరాజన్ దాదాపు 6 వేల కోట్ల విలువైన తన ఆస్తులన్నింటినీ తన ఉద్యోగులకు విరాళంగా ఇచ్చారు. తన చిన్న ఇల్లు, కారు మినహా తన ఆస్తులు అన్నింటిని విరాళం ఇచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా త్యాగరాజన్ మాట్లాడుతూ శ్రీరామ్ కంపెనీల్లో నా మొత్తం వాటాను 750 మిలియన్ డాలర్లు (రూ.6,120 కోట్లు) ఉద్యోగుల బృందానికి ఇచ్చాను. ఇది 2006లో ప్రారంభమైన శ్రీరామ్ ఓనర్షిప్ ట్రస్ట్‌కు బదిలీ చేశామని అన్నారు. శాశ్వత ట్రస్ట్‌లో గ్రూప్‌లోని 44 మంది ఎగ్జిక్యూటవ్‌లు లబ్ధిదారులుగా ఉన్నారు. సాధారణ ఆదాయం లేని వ్యక్తులకు రుణాలు ఇవ్వడం నమ్మినంత ప్రమాదకరం కాదని నిరూపించడానికి తాను ఫైనాన్స్ పరిశ్రమకు వచ్చాను అని తెలిపారు.






