SupremeCourt: ఆ 2వేల మందికీ కోర్టు చాలదు..స్టేడియం కావాలి: సుప్రీం ఆగ్రహం
మాజీమంత్రి సెంథిల్ బాలాజీ (Senthil Balaji) కేసు విషయంలో తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేశారని బాలాజీపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సెంథిల్ బాలాజీ కేసు విచారణను తమిళనాడు ప్రభుత్వం కావాలని ఆలస్యం చేస్తున్నట్లు కనిపిస్తోందని ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం కేసును మూసివేయడానికి ప్రయత్నిస్తే న్యాయశాఖ అడ్డుకుందని తాజాగా మందలించింది. ఈ కేసులో 2000 మంది నిందితులు, 500 మంది సాక్షలు ఉన్నారు. భారత్లో అత్యధిక మంది విచారణలో పాల్గొన్న కేసు ఇదే అవుతుందేమో. అలాగే ఆ నిందితులందరికీ ఈ కోర్టు గది సరిపోదు. ఒక క్రికెట్ స్టేడియం కావాలి అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిందితుడు, సాక్షుల పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.






