Supreme Court: ఆ 65 లక్షల మంది వివరాలు బయటపెట్టాలి.. ఈసీకీ సుప్రీంకోర్టు ఆదేశాలు

బిహార్‌లో ఇటీవల నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ లో 65 లక్షల మంది పేర్లను తొలగించిన విషయం తెలిసిందే. అయితే, ఆ 65 లక్షల మంది వివరాలను ఈ నెల 19లోపు బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘాని (Election Commission )కి సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశించింది. ఈ నెల 22 నాటికి సంబంధిత నివేదికను తమముందు ఉంచాలని సూచించింది. అదేవిధంగా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైనవారు ఆధార్ కార్డు (Aadhar card ) సమర్పించవచ్చని తెలిపింది.
బిహార్ (Bihar)లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు లో విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తన వాదనలు వినిపిస్తూ ఓటర్ల జాబితా సవరణ వంటి నిర్ణయాలు తీసుకునేందుకు ఈసీకి అధికారాలు ఉన్నాయి. రాజకీయ వాతావరణంలో పనిచేస్తున్న నేపథ్యంలో వివాదాస్పదం కాని నిర్ణయమంటూ ఏదీ లేదు. పార్టీల పోరు మధ్యలో చిక్కుకున్నాం. గెలిస్తే ఈవీఎం (EVM )లు మంచివని, ఓడిపోతే చెడ్డవని ప్రచారం చేస్తున్నారు అని పేర్కొంది.