ఎస్బీఐ ఆఫర్.. ఆగస్టు 31 వరకు అందుబాటులో
ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలు తీసుకోవాలనుకునే వారికి ఆఫర్ ప్రకటించింది. హోమ్‌లోన్ ప్రాసెసింగ్ ఫీజుపై 50-100 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. సాధారణంగా ఎస్బీఐ హోమ్‌లోన్ తీసుకునేటప్పుడు 0.35 శాతం ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తారు. కనీస మొత్తం రూ.2000 కాగా, గరిష్ఠంగా రూ.10 వేలు వరకు ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటారు. దీనికి జీఎస్టీ అదనం. ఈ నేపథ్యంలో సాధారణ హోమ్‌లోన్, టాప్ అప్ రుణాలకు 50 శాతం వరకు రాయితీ ప్రకటించారు. అంటే కనీస ప్రాసెసింగ్ ఫీజు రూ.2 వేలు, గరిష్ఠంగా రూ.5 వేలు ఉంటుంది. దీనికి జీఎస్టీ అదనం. అదే టోకోవర్, రీసేల్, రెడీ టు మూవ్ ప్రాపర్టీలకు అయితే 100 శాతం వరకు రాయితీ ఇస్తామని ఎస్బీఐ పేర్కొంది. ఇన్‌స్టా హోమ్టాప్, రివర్స్ మార్టగేజ్, ఈఎండీకి ఈ రాయితీ వర్తించదని తెలిపింది.






