Nita Ambani:నీతా అంబానీ కీలక ప్రకటన…త్వరలోనే అందుబాటులోకి

రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) కీలక ప్రకటన చేశారు. ముంబయి (Mumbai ) వాసుల కోసం అత్యాధునిక మెడికల్ సిటీ (Medical City ) తో పాటు కోస్టల్ గార్డెన్స్‌ను నిర్మించనున్నట్లు వెల్లడిరచారు. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీటిని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని, ప్రకృతి సోయగాలను అందించడానికి 130 ఎకరాల్లో కోస్టల్ రోడ్ గార్డెన్ (Coastal Garden) ను అభివృద్ధి చేస్తున్నట్లు నీతా అంబానీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా రోడ్డు పొడవునా చెట్లు, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు (Cycling Tracks) , పూలమొక్కలతో ఈ ఉద్యానవనాలను అందంగా రూపుదిద్దుతామన్నారు. దీనిద్వారా ముంబయి ప్రజలకు ప్రకృతిని, సముద్రతీరాల వద్ద అందమైన సూర్యోదయాలను అస్వాదించవచ్చన్నారు. ముంబయి ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం తాము ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.