రతన్ టాటా అంత్యక్రియలకు హాజరైన అమిత్ షా

ప్రముఖ వ్యాపార, పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణంతో యావత్ దేశం విచారంలో మునిగిపోయింది. ఆయన అంత్యక్రియలు ముంబయిలోని వర్లి శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. మహారాష్ట్ర పోలీసులు తుపాకులతో ఆయన భౌతికకాయానికి గౌరవ వందనం సమర్పించారు. రతన్ టాటా అంత్యక్రియలకు కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు. ఆయనతోపాటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వంటి ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై రతన్ టాటాకు కడసారి నివాళులు అర్పించారు.