Rahul Gandhi: దీనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా.. పూర్తి మద్దతిస్తాం : రాహుల్

భారతీయులందరూ ఐక్యంగా ఉండటం అవసరమని, తద్వారా ఉగ్ర చర్యలను, వారి లక్ష్యాలను దీటుగా ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. పహల్గాం (Pahalgam)లో జరిగిన ఉగ్రదాడిని విపక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండిరచాయని, దీనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా తాము మద్దతిస్తామని స్పష్టం చేశారు. శ్రీనగర్‌లో పర్యటించిన రాహుల్, లెఫ్టినెంట్ గవర్నర్ (Lieutenant Governor), సీఎంతో భేటీ కావడంతో పాటు ఉగ్రదాడి బాధితులను కలిసి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
సమాజాన్ని విభజించడం, సోదరుల మధ్య తగాదాలు సృష్టించడమే ఉగ్రవాదుల పని. ఈ ఉగ్రచర్యను జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) మొత్తం ఖండించింది. వీరికి యావద్దేశం పూర్తి మద్దతుగా నిలిచింది. భారతీయులంతా ఐక్యంగా ఉండటం ఎంతో ముఖ్యం. అప్పుడే ఉగ్ర చర్యలను, వారి ప్రయత్నాలను దీటుగా ఎదుర్కోగలం. కశ్మీర్‌తో పాటు దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారిపై కొందరు దాడులు చేయడం అత్యంత బాధాకరం. మనందరం ఐక్యంగా ఉండి ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలి. లెప్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రితోనూ భేటీ అయ్యాం. ఏం జరిగిందో వారు వివరించారు. మా పార్టీ తరపున పూర్తి మద్దతు ఉంటుందని వారిద్దరికీ హామీ ఇచ్చా అని రాహుల్ పేర్కొన్నారు.