Rahul Gandhi: పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఊరట

కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కి ఊరట లభించింది. ఆరేళ్ల క్రితం నాటి ఈ కేసులో ఝార్ఖండ్ (Jharkhand) లోని ప్రజాప్రతినిధుల కోర్టు తాజాగా బెయిల్ (Bail) మంజూరు చేసింది. ఝార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారని రాహుల్ తరపు న్యాయవాది మీడియాకు వెల్లడిరచారు. న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని, ఈ విషయాన్ని తాము మరింత ముందుకు తీసుకువెళ్తామని అన్నారు.
2018లో రaార్ఖండ్‌లోని చైబాసా ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్, అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలోనే ప్రతాప్ కుమార్ (Pratap Kumar) అనే వ్యక్తి చైబాసాలోని మేజిస్ట్రేట్ కోర్టులో రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఆయన ప్రకటనలు అమిత్ షా ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని ఆరోపించారు. ఈ కేసు విచారణ జరిపిన ప్రజాప్రతినిధుల కోర్టు రాహుల్‌కు బెయిల్ మంజూరు చేసింది.