Rahul Gandhi: మోడీదంతా షో మాత్రమే.. మీడియాలో ఆకాశానికెత్తేశారు: రాహుల్ గాంధీ

ప్రధాని నరేంద్ర మోడీపై (PM Narendra Modi) లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ఏమాత్రం పెద్ద సమస్యే కాదని, ఆయనకు విషయ జ్ఞానం లేదని రాహుల్ విమర్శించారు. “ఆయనదంతా కేవలం ఒక పెద్ద షో మాత్రమే. ఆయనకు మీడియాలో మరీ ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేశారు” అని రాహుల్ అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీతో (PM Narendra Modi) ఒకటి రెండు సార్లు సంభాషించిన తర్వాత, ఆయనలో ఏమాత్రం ధైర్యం లేదని తనకు అర్థమైందని రాహుల్ అన్నారు. “పీఎం మోడీ అంత పెద్ద విషయమే కాదు. మీడియా ఆయన్ను మరీ ఎక్కువ చేసి చూపించిందంతే” అని రాహుల్ (Rahul Gandhi) వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో, భారత బ్యూరోక్రసీలో అణగారిన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడంపై కూడా రాహుల్ మండిపడ్డారు. “దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలు, మైనార్టీలు కలిపి దేశ జనాభాలో 90 శాతం ఉంటారు. కానీ బడ్జెట్ సిద్ధం చేసిన తర్వాత సంప్రదాయంగా హల్వా పంచుకునే సమయంలో ఈ 90 శాతం మందికి ప్రాతినిధ్యం వహించడానికి ఒక్కరు కూడా ఉండరు. వాళ్లు అలా హల్వా తినకూడదని నేను అనడం లేదు. కానీ పని చేసే 90 శాతం మంది కూడా వారిలో ఉండాలని అంటున్నా” అని రాహుల్ (Rahul Gandhi) తీవ్రంగా విమర్శించారు.