Putin: త్వరలో భారత్ పర్యటనకు పుతిన్!

రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) త్వరలో భారత్ పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది. ఆయన పర్యటన తేదీలు ఖరారు చేస్తున్నట్లు జాతీయ భద్రత సలహాదారు అజిత్ డొభాల్ (Ajit Doval) వెల్లడిరచారు. ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న డొభాల్, రష్యా భద్రతామండలి సెక్రటరీ సెర్గీ షొయిగు (Sergei Shoigu)తో సమావేశమైన అనంతరం ఈ ప్రకటన చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల నేపథ్యంలో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సుంకాలు విధించిన వేళ ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది చివర్లో పుతిన్ భారత్ (India) కు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.