Rahul Gandhi: రాహుల్ గాంధీ కి పుణే కోర్టు సమన్లు

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహల్ గాంధీ (Rahul Gandhi) కి పుణె కోర్టు సమన్లు జారీ చేసింది. లండన్ (London) పర్యటన సమయంలో స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్(Vinayak Damodar Savarkar) ను ఉద్దేశిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సమన్లు అందాయి. లండన్ పర్యటన సమయంలో రాహుల్ సావర్కర్‌ను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ రాహుల్‌పై పరువునష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు (Police) గతంలో తేల్చారు. కాగా, దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం మే 9న ఆయన తమముందు హాజరుకావాలని కోరుతూ సమన్లు జారీ చేసింది.