Vanajeevi Ramaiah : వనజీవి రామయ్య మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య (Vanajeevi Ramaiah )(85) మృతిపై ప్రధాని మోదీ (Prime Minister Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా రామయ్య గుర్తుండిపోతా రని అన్నారు. లక్షలాది మొక్కులు (Plants) నాటడానికి, వాటిని రక్షించడానికి రామయ్య తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఆయన అవిశ్రాంత కృషి, ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ, భవిష్యత్ తరాలపట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి, యువత (Youth)లో మరింత సుస్థిరమైన హరిత గ్రహాన్ని నిర్మించాలనే తపనను ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఈ విషాధ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి (Sympathy) తెలియజేస్తున్నాను అని మోదీ పేర్కొన్నారు.