Mysore Palace : మైసూరు ప్యాలెస్‌ను సందర్శించిన రాష్ట్రపతి

అధికారిక పర్యటనలో భాగంగా మైసూరు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ప్రఖ్యాత మైసూర్ ప్యాలెస్ (Mysore Palace ) ను వీక్షించారు. ప్రతి విభాగాన్ని అద్భుతమని మెచ్చుకుంటూ ముందుకు సాగారు. రాజమాత ప్రమోదా దేవి, యువరాజు, మైసూరు ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజు ఒడెయరు (Chamaraju Odeyar), ఆయన భార్య త్రిషిక (Trishika) , కుటుంబ సభ్యులు గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ (Thawarchand Gehlot) రాష్ట్రపతి వెంట ఉన్నారు. రాజ్‌భవన్ తరపున ప్రత్యేకంగా చేయించిన వినాయకుని విగ్రహాన్ని రాష్ట్రపతికి గవర్నర్ గహ్లోత్ అందజేశారు. మండహళ్లి విమానాశ్రయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆమెకు వీడ్కోలు పలికారు. ప్రత్యేక విమానంలో ముర్ము తమిళనాడుకు బయలుదేరి వెళ్లారు.