Prashant Kishore: రెండు గంటలు సలహా ఇచ్చి.. రూ.11 కోట్లు తీసుకున్నా : ప్రశాంత్ కిశోర్

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా తన పార్టీ విరాళాల గురించి వస్తోన్న ఆరోపణలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక రెండు గంటల పాటు సలహా (Advice) ఇచ్చినందుకు రూ.11 కోట్లు తీసుకున్నా. ఇది ఈ బిహార్ (Bihar) కుర్రాడి శక్తి అని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు చేశారు. తాను నిధులను వృత్తిపరమైన ఫీజులతోనే సమకూర్చుకొన్నట్లు వెల్లడిరచారు. జీఎస్టీ (GST) , ఇన్‌కమ్‌ట్యాక్స్ (Income Tax) చెల్లించి, తన సొమ్మును పార్టీకి విరాళంగా ఇచ్చినట్లు వివరించారు. డొల్ల కంపెనీల నుంచి విరాళాలు వస్తున్నాయని ఆరోపించిన వారికి మీడియా ఎదుట గట్టి కౌంటర్ ఇచ్చారు.