Narendra Modi : ప్రధాని మోదీ చైనా పర్యటన షెడ్యూల్ ఖరారు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) త్వరలో చైనా (China) లో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. తియాంజిన్ (Tianjin) వేదికగా ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరగనున్న షాంఘై సహకార సదస్సు లో ఆయన పాల్గొననున్నారు. గల్వాన్ ఘటన(Galwan incident) తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping ) లతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది కజాన్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో జిన్‌పింగ్‌తో మోదీ భేటీ అయిన విషయం తెలిసిందే.