Modi: ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో స్టాంప్, నాణెం విడుదల చేసిన ప్రధాని మోడీ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన తపాలా బిళ్ల (పోస్టల్ స్టాంప్), నాణెం (కాయిన్)ను ప్రధాని (PM Modi) విడుదల చేశారు. వందేళ్లు పూర్తి చేసుకున్నందుకు ఆర్ఎస్ఎస్ (RSS) సేవకులకు అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ (PM Modi).. గత శతాబ్ద కాలంలో సంఘ్ చేపట్టిన ఎన్నో సేవా కార్యక్రమాలను గుర్తు చేశారు. “ఆర్ఎస్ఎస్ అంటే విజయమని, దేశమే ముఖ్యం అనేది ఆర్ఎస్ఎస్ (RSS) విధానమని” ప్రధాని ప్రశంసించారు. దేశానికి సేవ చేయడానికి సంఘ్ ఎప్పుడూ ముందుంటుందని మోడీ నొక్కి చెప్పారు.