PM Modi: రాహుల్ అభద్రతా భావంతో వెనుకబడుతున్న కాంగ్రెస్ యువనేతలు: ప్రధాని మోడీ

వర్షాకాల సమావేశాల అనంతరం ఎన్డీయే కూటమి నేతలతో జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ (PM Modi) పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది ప్రతిభావంతులైన యువనేతలు ఉన్నప్పటికీ, వారికి కనీసం మాట్లాడే అవకాశం కూడా లభించడం లేదని ప్రధాని అన్నారు. దీనికి కారణం ‘ఒక కుటుంబం’లో ఉన్న అభద్రతా భావమేనని, వీరంతా తన నాయకత్వానికి పోటీ వస్తారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) భయపడుతున్నారని పరోక్షంగా పేర్కొన్నారు. ఈ అభద్రతా భావం వల్లనే రాహుల్ గాంధీ ఒత్తిడికి గురవుతున్నారని ఆయన (PM Modi) అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు బాగా జరిగాయని, కీలక బిల్లులు ఆమోదం పొందాయని మోడీ తెలిపారు. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బిల్లు భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపుతుందని ఆయన (PM Modi) విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాన బిల్లులపై చర్చించకుండా ప్రతిపక్షాలు సభలో అల్లకల్లోలం సృష్టించేందుకే ప్రయత్నించాయని మోడీ విమర్శించారు. సభను సక్రమంగా నడపకుండా అడ్డుకోవడానికే ప్రతిపక్షాలు ప్రాధాన్యత ఇచ్చాయని ఆయన (PM Modi) వ్యాఖ్యానించారు.