Narendra Modi : జిన్‌పింగ్, పుతిన్‌లతో భేటీకి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా : మోదీ

నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఢల్లీి నుంచి జపాన్ (Japan)కు బయలుదేరారు. ఈ నెల 29 నుంచి సెప్టెంబరు 1 వరకు కొనసాగే పర్యటనలో తొలి రెండు రోజులు జపాన్‌లో, తర్వాత చైనా (China) లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Jinping) , రష్యా అధినేతతో సమావేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. 29, 30 తేదీల్లో ప్రధాని మోదీ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఆగస్టు 31, సెప్టెంబరు 1న చైనాలోని తియాన్జిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సుకు హాజరవుతారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఎస్‌సీవో సదస్సులో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) సహా 20 మందికి పైగా ప్రపంచ నాయకులు పాల్గొననున్నారు.