Kartavya Bhavan : కర్తవ్య భవన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశ రాజధాని ఢల్లీిలో ఉమ్మడి కేంద్ర సచివాలయ ( సీసీఎస్) ప్రాజెక్టు కింద నిర్మించిన మొదటి భవనమైన కర్తవ్య భవన్ (Kartavya Bhavan) ను ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 10 కార్యాలయ భవనాలు నిర్మించనున్నట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ తెలిపింది. సీసీఎస్-3గా పరిగణిస్తున్న కర్తవ్య భవన్‌లోకి కేంద్ర హోం (Central Home) , విదేశీ వ్యవహారాలు, పెట్రోలియం (Petroleum) శాఖ, ప్రధాన మంత్రికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయాలు తరలించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సీసీఎస్-2, సీసీఎస్-3 భవనాలు వచ్చే నెలకి పూర్తికానుండగా, సీసీఎస్ -10వ భవనం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి, 6వ, 7వ భవనాలు వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. 2019లో ప్రారంభించిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు (Central Vista Project ) లో సిద్ధమైన మొదటి భనవమిదే కావడం గమనార్హం.