Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు

ప్రధాని నరేంద్ర మోదీ రక్షా బంధన్(Raksha Bandhan) వేడుకలను విద్యార్థులు, ఆధ్మాత్మిక సంస్థ బ్రహ్మ కుమారి సభ్యులతో కలిసి జరుపుకొన్నారు. ఢల్లీిలోని ప్రధాని నివాసంలో శనివారం ఉదయం 7 గంటల సమయంలో పలువురు విద్యార్థులు (Students), బ్రహ్మకుమారి సభ్యులు (Brahma Kumaris members) మోదీ కి రాఖీ (Rakhi) కట్టారు. అనంతరం మోదీ వారితో కొంతసేపు సరదాగా ముచ్చటించారు. గతేడాది కూడా ప్రధాని ఇలాగే స్కూల్ విద్యార్థినులతో రాఖీ కట్టించుకున్న సంగతి తెలిసిందే.
అంతకుమందు రాఖీ పండుగను పరస్కరించుకొని దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సోదర సోదరీమణుల మధ్య అపరిమిత ప్రేమకు ప్రతీక ఈ రక్షా బంధన్. ఈ పండుగ మీ బంధాలను మరింత తీపికరంగా చేయాలని, ఆప్యాయత, సామరస్య భావాలను బలోపేతం చేయాలని, ప్రజలంతా ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా అని మోదీ పేర్కొన్నారు.