Narendra Modi:డొనాల్డ్ ట్రంప్ ప్రకటన పై .. మోదీ సమాధానం చెప్పాలి

ఈ నెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ (Congress) ప్రశ్నల వర్షం కురిపించడానికి సమాయత్తం అవుతోంది. భారత్- పాక్‌ల మధ్య కాల్పులు విరమణ తానే చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ఈ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యాలపై కాంగ్రెస్ కార్యదర్శి జైరాం రమేశ్ (Jairam Ramesh) స్పందించారు. భారత్ పాక్ మధ్య అణు యుద్ధాన్ని తానే అపానని డొనాల్ ట్రంప్ 23 సార్లు పునరుద్ఘాటించారు. ఈ నెల 21 నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు (Parliament sessions) జరగనున్నాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రధాని మోదీ దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పాలి. దేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు అని జైరాం రమేశ్ పేర్కొన్నారు.