కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. భారీగా తగ్గుతాయా?
దేశ ప్రజలకు రక్షాబంధన్ గిప్ట్ అందించిన కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుందా అంటే అవుననే అంటున్నాయి తాజా రిపోర్టులు. వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గిన నేపథ్యంలో ఇప్పుడు అందరి ఆశలు పెట్రోల్, డీజిల్‌పైకి మళ్లాయి. గ్యాస్ ధర తగ్గింపుతో ద్రవ్యోల్బణం దిగిరావొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి వాహన ఇంధన ధరల కోత కూడా తోడైతే అన్ని నిత్యావసరాల ధరలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. సామాన్యులు కూడా ఇదే ఆశిస్తున్నారు. అయితే ఇవన్నీ నిజమయ్యే అవకాశం ఉందని ప్రముఖ సంస్థ అంచనా వేసింది. రాబోయే పండగల సీజన్‌తో పాటు వరుస ఎన్నికల నేపథ్యంలో కేంద్రం పెట్రో ధరల తగ్గింపు పై సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని తెలిసింది. వంట గ్యాస్ ధర తగ్గించాలన్న కేంద్రం నిర్ణయంతో ద్రవ్యోల్బణం దాదాపు 30 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక వేత్తలు సమీరన్ చక్రవర్తి, బకార్ ఎం. జైదీ తెలిపారు. ఇటీవల టమాటాల ధరలు దిగివచ్చిన నేపథ్యంలో సెప్టెంబరులో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.






