GST Reforms: జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు లబ్ధి: నిర్మలా సీతారామన్

జీఎస్‌టీ తగ్గింపు నిర్ణయం (GST Reforms) ఫలితాలు ప్రజలకు అందుతున్నాయని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. జీఎస్‌టీ తగ్గింపుతో ప్రజలకు ప్రయోజనం చేకూరడం, ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ‘జీఎస్టీ బచత్ ఉత్సవ్’పై (GST Reforms) ఢిల్లీలో సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, వాణిజ్య మంత్రి పియూష్ గోయల్‌తో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలా మాట్లాడుతూ.. జీఎస్‌టీ 2.0 సంస్కరణలు (GST Reforms) దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతం ఇచ్చాయని అన్నారు.
ముఖ్యంగా పండుగ సీజన్‌లో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, వినియోగ వస్తువులు వంటి కీలక రంగాలలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని ఆమె (Nirmala Sitharaman) వెల్లడించారు. గత నవరాత్రి ఉత్సవాల కంటే ఈ ఏడాది నవరాత్రి సీజన్‌లో ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు 25 శాతం పెరిగాయని తెలిపారు. జీఎస్‌టీ సంస్కరణల (GST Reforms) కారణంగా ఆహార ధరలు తగ్గుతున్నాయని, ఎలక్ట్రానిక్స్‌కు పెరుగుతున్న డిమాండ్ తయారీ పరిశ్రమకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఐఎంఎఫ్ కూడా భారతదేశ వృద్ధి రేటు అంచనాలను 6.6 శాతానికి పెంచినట్లు ఆమె (Nirmala Sitharaman) వెల్లడించారు.