Parliament : వీవీఐపీల భద్రతకు సవాల్‌గా ..నంబర్ 1 చెట్టు!

పార్లమెంట్‌లో ఓ చెట్టు వీవీఐపీ (VVIP ) ల భద్రతకు సవాల్‌గా మారింది. గజ ద్వారాం వద్ద ఉన్న ఆ వృక్షంతో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆ చెట్టును మరో చోటుకు మార్చేందుకు భద్రతా సిబ్బంది సన్నాహాలు ప్రారంభించారు. కొత్త పార్లమెంట్ భవనంలోని ఆరు ప్రవేశ మార్గాల్లో గజ ద్వారం ఒకటి. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తరచూ ఈ మార్గం నుంచే సభకు వెళ్తుంటారు. ఈ గేటు వద్ద ఓ పసుపు పూల చెట్టు ఉంది. నంబర్ 1 పేర్కొన్నే ఈ చెట్టు విపరీతంగా పెరిగి ఈ ప్రాంతంలో భద్రతకు అడ్డంకిగా మారింది. వీవీఐపీలు వెళ్లే మార్గంలో ఈ చెట్టు వల్ల భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతుండటంతో దీన్ని ఇక్కడి నుంచి మార్చాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) భావించింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడబ్ల్యూడీకి) కు వివరించింది.
అయితే, ఈ చెట్టును తొలగించాలంటే ఢల్లీి అటవీ శాఖ నుంచి అనుమతి తప్పనిసరి. దీంతో ఆ భద్రతా సిబ్బంది ఆ ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం ఇప్పటికే అటవీశాఖ వద్ద రూ.57 వేల సెక్యూరిటీ డిపాజిట్‌ను జమ చేశారు. వచ్చేవారం పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రేరణ స్థల్ వద్దకు దీన్ని మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చెట్టును తరలిస్తున్నందుకు పరిహారంగా సీపీడబ్ల్యూడీ (CPWD) పార్లమెంట్ ప్రాంగణంలోనే మరో 10 మొక్కలు నాటాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడిరచారు.