జూలైలో 40% మార్కెట్ వాటాతో EV 2W విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న ఓలా
జూలై అమ్మకాలలో 375% Y-O-Y వృద్ధి నమోదు
ఆగస్ట్ 15 వరకు రూ. 1,09,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉండనున్న S1 ఎయిర్
భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, జూలై నెలలో ఆకట్టుకునే అమ్మకాలను సాధించి EV 2W మార్కెట్లో తన బలమైన స్థానాన్ని కొనసాగిస్తోంది. కంపెనీ జూలైలో దాదాపు 19,000 యూనిట్లను విక్రయించి (వాహన్ డేటా ప్రకారం) ~40% వాటాతో మార్కెట్ లీడర్‌గా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. ఓలా గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలలో 375% Y-o-Y వృద్ధిని సాధించింది.
ఓలా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుష్ అగర్వాల్ మాట్లాడుతూ, “ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ లీడర్ గా స్థానాన్ని నిలబెట్టుకుంది మరియు #EndICEAge నినాదాన్ని నిజం చేసేందుకు నిబద్ధతతో ఉంది. విప్లవాత్మకమైన S1 ఎయిర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నందున, మా ఈ సరికొత్త ప్రోడక్ట్ స్కూటర్ సెగ్మెంట్లో EV మాస్ మార్కెట్ అడాప్షన్ ను ఊపందుకునేలా చేస్తుంది. తద్వారా భారతదేశం యొక్క EV వ్యాప్తిని వేగవంతం చేయడానికి ఓలా ఎంతో తోడ్పడుతుంది. అత్యంత అందుబాటు ధరలో వస్తున్న S1 ఎయిర్ ICE స్కూటర్లకు సరైన సమాధానం, మరియు దాని అతి తక్కువ TCO (Total Cost of Ownership) తో ఇది #EndICEAgeని మరింత వేగవంతం చేస్తుంది. ఆగస్ట్‌లో S1 ఎయిర్ డెలివరీల గురించి మరియు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా యొక్క వార్షిక ఫ్లాగ్షిప్ ఈవెంట్ జరుగుతుండడంతో మేము సంతోషిస్తున్నాము.”
Ola S1 ఎయిర్ కస్టమర్ల నుండి మంచి స్పందనను పొందింది మరియు 50,000+ బుకింగ్‌లను నమోదు చేసుకుంది. అధిక డిమాండ్ మరియు దాని ప్రారంభ ధరలో స్కూటర్ లభ్యతను పొడిగించమని అనేక అభ్యర్థనల మేరకు, కంపెనీ కస్టమర్లందరికీ INR 1,09,999 ఆకర్షణీయమైన ప్రారంభ ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని ఆగస్టు 15 వరకు పొడిగించింది.
తక్కువ రన్నింగ్ మరియు మెయింటెనెన్స్ ఖర్చుతో, S1 మరియు S1 ప్రో నుండి సంక్రమించిన అత్యాధునిక సాంకేతికత మరియు డిజైన్ అంశాలను S1 ఎయిర్ అందిస్తుంది, అదే సమయంలో నమ్మశక్యం కాని ధరతో అందుబాటులోకి వస్తుంది. బలమైన 3 kWh బ్యాటరీ కెపాసిటీ, 125 కిమీ సర్టిఫైడ్ రేంజ్ మరియు 90 కిమీ/గం యొక్క చెప్పుకోదగిన టాప్ స్పీడ్‌తో, Ola S1 ఎయిర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంది.






