శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్‌తో ఓలా ఎలక్ట్రిక్ భాగస్వామ్యం; అవాంతరాలు లేని ఫైనాన్సింగ్ పరిష్కారాలే లక్ష్యం
భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, చిన్న నగరాల్లోకి EV వ్యాప్తిని మరింత లోతుగా తీసుకెళ్లేందుకు తన ప్రయత్నాలను వేగవంతం చేయడంలో భాగంగా శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో, ఓలా 48 నెలల కాలవ్యవధికి కేవలం 8.99% వడ్డీ రేటుతో ఫైనాన్సింగ్ వెసులుబాటును అందిస్తోంది. అంతేకాకుండా, నిమిషాల్లో ఆమోదాలు ఇవ్వబడతాయి. దీనితో, ఓలా ఎలక్ట్రిక్ EVలను మరింత సరసమైనదిగా మరియు అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం ద్వారా #EndICEAgeకి తన నిబద్ధతను మరోసారి చాటిచెప్తుంది.
శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ భారతదేశంలోని అగ్రగామి NBFC మాత్రమే కాకుండా, దేశంలోని 2W యొక్క అతిపెద్ద ఫైనాన్షియర్లలో ఒకటి. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో సుమారు 2,800 శాఖలను ఈ సంస్థ కలిగి ఉంది.
ఓలా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుష్ అగర్వాల్ మాట్లాడుతూ: “మేము మా రిటైల్ ఫుట్‌ప్రింట్‌ను Tier-1 నగరాలకు మించి విస్తరింపజేస్తున్నందున, ఫైనాన్సింగ్ పరిష్కారాలను సులభంగా మరియు అందరికీ అందుబాటులో ఉంచడంపై మేము దృష్టి పెడుతున్నాము. శ్రీరామ్ సిటీ యూనియన్‌తో మా భాగస్వామ్యంతో, మేము కస్టమర్ల యొక్క ఆర్థిక అడ్డంకులను అధిగమించి, వినియోగదారుల కోసం విద్యుత్ మొబిలిటీని వాస్తవంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. దేశవ్యాప్తంగా EV స్వీకరణను వేగవంతం చేయడానికి ఇది మార్గం సుగమం చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము,” అని అన్నారు.
ఓలా యాప్ ద్వారా తమ కొనుగోలును ఖరారు చేసే ముందు ఫైనాన్సింగ్ ఆప్షన్లపై వివరణాత్మక సమాచారం కోసం వినియోగదారులు తమ సమీప అనుభవ కేంద్రానికి వెళ్లడం ద్వారా ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో ఈ ఫైనాన్సింగ్ ఎంపికలను పొందవచ్చు. ఓలా ప్రస్తుతం 850+ అనుభవ కేంద్రాలతో భారతదేశపు అతిపెద్ద D2C ఆటోమొబైల్ రిటైల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది మరియు ఆగస్టులో 1,000వ ECని ప్రారంభించేందుకు సన్నద్ధమవుతుంది.
S1 ప్రో, S1 మరియు S1 ఎయిర్లతో కూడిన S1 లైనప్ అత్యాధునిక సాంకేతికత మరియు అసమానమైన పనితీరుతో కూడిన సొగసైన మరియు మినిమలిస్ట్ డిజైన్‌ను కలిగి ఉంది. కంపెనీ ఇప్పుడు వరుసగా మూడు త్రైమాసికాలకు పైగా 2W EV విభాగంలో అమ్మకాలలో అగ్రస్థానంలో ఉంది. ఓలా EV 2W విభాగంలో దాదాపు 40% మార్కెట్ వాటాను సొతంచేసుకొని మార్కెట్ షేర్ లీడర్ గా కొనసాగుతుంది.






