జూలై 28 నుండి S1 ఎయిర్ కొనుగోలు విండోను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన ఓలా
భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, అత్యంత అంచనాలతో అందుబాటు ధరలో వస్తున్న S1 ఎయిర్ స్కూటర్ కొనుగోలు విండోను జూలై 28న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఓలా కమ్యూనిటీ కి మరియు జూలై 28 లోపు S1 ఎయిర్ని బుక్ చేసుకునే వారికి INR 1,09,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ పరిమిత వ్యవధి కొనుగోలు విండో జూలై 28 నుండి జూలై 30 వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఇతర కస్టమర్లందరికీ, కొనుగోలు విండో 31వ తేదీ నుండి INR 1,19,999 కి సవరించిన ధరతో ప్రారంభమవుతుంది మరియు ఆగస్టు ప్రారంభంలో డెలివరీలు ప్రారంభమవుతాయి.
Ola S1 ఎయిర్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను ఘననీయంగా పెంచే ఒక ఖచ్చితమైన అర్బన్ సిటీ రైడ్ కంపానియన్. అతితక్కువ రన్నింగ్ మరియు మెయింటెనెన్స్ ఖర్చులతో, S1 మరియు S1 ప్రో నుండి సంక్రమించిన అత్యాధునిక సాంకేతికత మరియు డిజైన్ అంశాలను S1 ఎయిర్ అత్యంత సరసమైన ధరలో అందిస్తుంది. బలమైన 3kWh బ్యాటరీ కెపాసిటీ, 125 కిమీల సర్టిఫైడ్ రేంజ్ మరియు 90 కిమీ/గం టాప్ స్పీడ్‌తో, Ola S1 ఎయిర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంది. ప్రకటనపై వ్యాఖ్యానిస్తూ, ఓలా ప్రతినిధి ఇలా అన్నారు.
“S1 ఎయిర్‌తో మా లక్ష్యం ఎల్లప్పుడూ భారతదేశం యొక్క ఎలక్ట్రిక్ వాహన విప్లవాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే. S1 మరియు S1 ప్రోల విజయం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రధాన స్రవంతిలోకి మార్చింది. S1 ఎయిర్ రాక త్వరలో భారతదేశ స్కూటర్ పరిశ్రమలో ICE యుగానికి ముగింపు పలకనుందని మేము విశ్వసిస్తున్నాము.” దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగవంతం చేయడానికి భారతదేశం అంతటా అనేక ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లను (ECలు) ఏర్పాటు చేయడం ద్వారా కంపెనీ చురుకుగా తన ఉనికిని పెంపొందించుకుంటుంది.
కంపెనీ ఇటీవలే తన 750వ ECని ప్రారంభించింది మరియు ఆగస్టు నాటికి 1,000 కేంద్రాలకు విస్తరించాలని యోచిస్తోంది. సుమారు 90% మంది కష్టమర్లు అలా ఎక్స్పీరియన్స్ సెంటర్లకు 20 కిలోమీటర్ల లోపలే ఉండడం విశేషం. స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ టెక్నాలజీ మరియు అసమానమైన పనితీరు కలిగిన S1 ప్రో, S1, మరియు S1 ఎయిర్లతో కూడిన S1 లైనప్ సొగసైన మరియు మినిమలిస్ట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. కంపెనీ ఇప్పుడు వరుసగా మూడు త్రైమాసికాలకు పైగా 2W EV విభాగంలో అమ్మకాల చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది.






