బెంగళూరులో ‘ప్రైమ్ ప్లస్’ సర్వీస్‌ను పూర్తి స్థాయిలో ప్రారంభించిన ఓలా
భారతదేశపు అతిపెద్ద రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన ఓలా, కస్టమర్లకు అంతరాయం లేని ప్రయాణ అనుభవాన్ని అందించడానికి రూపొందించబడిన ఒక కొత్త ప్రీమియం సర్వీస్ “ప్రైమ్ ప్లస్” ను బెంగళూరులో పూర్తి స్థాయి లో ప్రారంభించినట్లు ప్రకటించింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న పైలట్ ప్రోగ్రామ్ అతి పెద్ద సక్సెస్ ను సాదించండంతో, ఓలా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రైమ్ ప్లస్ ద్వారా ఓలా ప్రొఫెషనల్ డ్రైవర్లతో అసాధారణమైన రైడ్ హెయిలింగ్ అనుభవాన్ని అందించడమే కాకుండా రైడ్ కాన్సలేషన్స్ మరియు కార్యాచరణ ఇబ్బందులను తొలగిస్తుంది.
అనేక ఫీచర్లతో కస్టమర్ అంచనాలను మించిపోయేలా రూపొందించబడిన ప్రైమ్ ప్లస్, ఈ రోజు నుండి బెంగళూరు అంతటా వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది మరియు ఈ నెలలో మరిన్ని నగరాల్లో ప్రారంభించబడుతుంది.
“ప్రైమ్ ప్లస్ యొక్క పైలట్ బెంగుళూరులో అద్భుతమైన విజయాన్ని సాధించింది, మరింత మెరుగైన సౌకర్యం, విశ్వసనీయత మరియు సౌలభ్యంతో కస్టమర్ సంతృప్తిని గణనీయంగా పెంచగలిగింది. బెంగుళూరులో పూర్తి స్థాయి లాంచ్‌ను ప్రకటించడం పట్ల మేము చాలా సంతోషిస్తున్నాము, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఇతర నగరాలకు క్రమంగా విస్తరింపజేస్తాము. ఓలా తమ వినియోగదారుల మారుతున్న అవసరాలకు అనుగుణంగా తమ సేవలను మెరుగుపరుస్తుంది,” అని ఓలా ప్రతినిధి తెలిపారు.
2011లో సేవలను ప్రారంభించిన ఓలా, ప్రపంచంలోని కొన్ని లాభదాయకమైన వినియోగదారు ఇంటర్నెట్ కంపెనీలలో ఒకటి. మార్కెట్ లీడర్‌గా ఉండటమే కాకుండా, 200 నగరాల్లో కార్యకలాపాలు మరియు ప్లాట్‌ఫారమ్‌లో 1 మిలియన్ కంటే ఎక్కువ డ్రైవర్లతో భారతదేశంలో అతిపెద్ద రైడ్-హెయిలింగ్ నెట్‌వర్క్‌ను కూడా ఓలా కలిగి ఉంది.






