America:అమెరికాతో రక్షణ ఒప్పందాలు యథాతథం : కేంద్రం

భారత్ వస్తువులపై టారిఫ్‌లను 50 శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటన చేసిన వెళ రక్షణ ఒప్పందాల (Defense contracts)ను నిలిపి వేసినట్లు వస్తున్న వార్తలను కేంద్రం కొట్టివేసింది. రక్షణ ఒప్పందాలను రద్దు(Cancellation) చేసుకునే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. రక్షణ సామాగ్రి కొనుగోలు ఒప్పందాలు యథాతథంగా అమలవుతాయని పేర్కొంది. అమెరికా నుంచి అందాల్సినవి ఒప్పందం ప్రకారం అందుతూనే ఉంటాయని, తదుపరి ఆరడ్డర్లపై చర్చలు కూడా కొనసాగుతాయని వివరించింది. అమెరికా నుంచి రక్షణ కొనుగోళ్లను భారత ప్రభుత్వం ఆపేసిందంటూ వస్తున్న వార్తలు అసత్యాతలు, అభూత కల్పనలు అని రక్షణ శాఖ అధికారి పేర్కొన్నారు. టారిఫ్‌ల పెంపు నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ (Rajnath) అమెరికా వెళ్లి, కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకుంటారంటూ వస్తున్న వార్తలను కూడా ఆయ న తోసిపుచ్చారు.