ముఖేష్ అంబానీ మరో సంచలన నిర్ణయం
రిలయన్స్ 46 వార్షిక సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) బోర్డుకి నీతా అంబానీ రాజీనామా చేస్తున్నట్లు ముఖేస్ అంబానీ ప్రకటించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల బాద్యతల్ని అంబానీ వారసులు చేపట్టనున్నారు. ముఖేష్ అంబానీ వారసులు ఈశా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలను రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డ్‌లో నాన్ -ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లుగా నియమించారు. ఏజీఎం సమావేశానికి ముందు జరిగిన సమావేశంలో కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు ముఖేష్ తెలిపారు. వీరి నియామకాన్ని షేర్ హోల్డర్లు అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఆర్ఐఎల్ బోర్డుకి ముఖేష్ అంబానీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. నీతా అంబానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు రాజీనామా చేసినప్పటికీ, ఆమె అన్ని బోర్డు సమావేశాలకు శాశ్వత ఆహ్వానితురాలిగా హాజరవుతూనే ఉంటారని, తద్వారా కంపెనీ వృద్ధికి సహాయ సహకారాలుంటాయని తెలిపారు.






