Lok Sabha : కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు లోక్‌సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. జైజయంత్ పాండా సారథ్యంలో 31 మంది సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు నవీకరించిన బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే ఎలాంటి చర్చా జరగకుండానే మూజువాణి (Moojuvani) ఓటుతో సభామోదం పొందింది. బిహార్(Bihar) ఓటర్ల సమగ్ర సవరణపై విపక్షాలు ఆందోళన నిర్వహిస్తుండడంతో దీనిపై చర్చకు తావులేకుండా పోయింది. బిల్లు పాసైన అనంతరం సభ వాయిదా పడిరది.