Narendra Modi :నెహ్రూ హయాంలో రాజ్యాంగ సవరణ : మోదీ

మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) భారత దేశాన్ని రెండుసార్లు విభజించారని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరోపించారు. ఈ సందర్భంగా మోదీ మీడియాతో మాట్లాడుతూ ఒకసారి రాడ్‌క్లిఫ్ లైన్‌తో విభజిస్తే, భారత్‌కు చెందిన సింధూ నదిని ముక్కలు చేసి మరోసారి విభజించారన్నారు. దీనివల్ల దేశంలో వ్యవసాయానికి గణనీయమైన నష్టం వాటిల్లిందన్నారు. కొంత కాలానికి పాకిస్థాన్ (Pakistan)తో తాను చేసుకున్న సిందూ నది ఒప్పందం వల్ల 80 శాతం నీరు ఆ దేశానికి వెళ్లాయని, భారత్‌కు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదనే విషయాన్ని నెహ్రూనే స్వయంగా అంగీకరించారన్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) రైతులకు వ్యతిరేకి అనే దానికి ఆయన తీసుకున్న నిర్ణయాలే నిదర్శనమన్నారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రపు హక్కును కాలరాసేందుకు నెహ్రూ హయాంలో రాజ్యాంగ సవరణ చేశారని మోదీ మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల సంఖ్యను పెంచేశారని ఆరోపించారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేయలేదని, తమ ప్రభుత్వం అధికారం చేపట్టాకే వారి అభివృద్ధి మొదలయ్యిందని, ఎన్డీఏ పాలనలో దేశం మూడో ఆర్థిక శక్తిగా ఎదిగే దిశగా అడుగులు వేస్తోందన్నారు.