CP Radhakrishnan: నామినేషన్ దాఖలు చేసిన ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్

కేంద్రంలో అధికార పక్షం అయిన ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ (CP Radhakrishnan) తమ నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా సహా పలువురు ఎన్డీయే కూటమి నాయకులు హాజరయ్యారు. నాలుగు సెట్లలో రూపొందించిన నామినేషన్ పత్రాలపై సీపీ రాధాకృష్ణన్‌తో (CP Radhakrishnan) పాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నాయకులు సంతకాలు చేశారు. ఆ తరువాత, ప్రధాని మోదీతో కలిసి సీపీ రాధాకృష్ణన్ ఈ పత్రాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోడీకి అందజేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు సెప్టెంబర్ 9న జరగనున్నాయి.