Vice President : ఉపరాష్ట్రపతి పదవికి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు

ఉపరాష్ట్రపతి (Vice President) పదవికి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan) నామినేషన్ దాఖలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చేతుల మీదుగా ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి అయిన రాజ్యసభ సెక్రెటరీ పీసీ మోదీకి సమర్పించారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh), బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah), రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ఎన్డీయే భాగస్వామ్యపక్షాలైన టీడీపీ నుంచి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, జేడీయూ నుంచి రాజీవ్ రంజన్‌సింగ్, జేడీఎస్ నుంచి హెచ్‌డీ కుమారస్వామి, లోక్‌జనశక్తి (రాంవిలాస్ పాసవాన్) నుంచి చిరాగ్ పాసవాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సీపీ రాధాకృష్ణన్ తరపున మొత్తం నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.