Parliament : ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు

ఈ నెల 21 నుంచి పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది కొత్త బిల్లులను పార్లమెంట్‌కు సమర్పించనున్నది. 1.పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వి మణిపూర్ వస్తువులు, సేవల పన్ను (సవరణ) బిల్లు 2025, 2. పబ్లిక్ ట్రస్ట్ (నిబంధనల సవరణ) బిల్లు 2025, 3.ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (Indian Institute of Management) (సవరణ) బిల్లు 2025, 4. పన్ను చట్టాలు (సవరణ) బిల్లు 2025, 5.జియో-హెరిటేజ్ సైట్స్ అండ్ జియో-రిమైన్లు (సంరక్షణ-నిర్వహణ) బిల్లు 2025, 6. గనులు-క్వారీలు (అభివృద్ధి-నియంత్రణ) సవరణ బిల్లు 2025, 7. జాతీయ క్రీడా పరిపాలన బిల్లు (National Sports Administration Bill) 2025, 8. జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు 2025లను కేంద్రం లోక్‌సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని చూస్తున్నది.