Rahul Gandhi : ట్రంప్వి అబద్దాలని మోదీ చెప్పలేకపోతున్నారు : రాహుల్
భారత్-పాకిస్థాన్ పోరు విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) చెబుతున్నవి అబద్ధాలని ప్రధాని మోదీ (Modi) చెప్పలేకపోతున్నారని లోక్సభ (Lok Sabha)లో విపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి విమర్శించారు. దీనివెనుక ఏదో రహస్యం దాగి ఉందని, కప్పిపుచ్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ట్రంప్ మాటాలు అబద్ధాలని మోదీ చెబితే అసలు నిజాలు బయటకొస్తాయి. అందుకే ఏం మాట్లాడలేకపోతున్నారని స్పష్టమవుతోంది అని లోక్సభలో చెప్పారు.






