Modi : త్వరలోనే శాంతియుత పరిష్కారం … జెలెన్‌స్కీతో మోదీ

ఉక్రెయిన్ యుద్ధానికి సాధ్యమైనంత త్వరలో, శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు అన్ని రకాలుగా సహకరిస్తామని ప్రధాని మోదీ (Modi) చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky)తో ఫోన్‌లో మాట్లాడిన మోదీ ఈ విషయాన్ని ఆయనకు స్పష్టం చేశారు. మూడు రోజుల కిందట రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin)తో చర్చించిన మోదీ, తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడితోనూ మాట్లాడారు. శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. భారత్-ఉక్రెయిన్ (India-Ukraine) సంబంధాల బలోపేతానికి కూడా కట్టుబడి ఉన్నామని తెలిపారు. శాంతి ప్రయత్నాల్లో మోదీ మద్దతుగా నిలుస్తామని ప్రకటించడాన్ని అభినందిస్తూ జెలెన్‌స్కీ తెలిపారు. అయితే, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించాలని సూచించారు. అలా చేస్తే రష్యాకు యుద్ధం కొనసాగించే ఆర్థిక సామర్థ్యం తగ్గుతుందని తెలిపారు.