Marcos Jr : భారత్ పర్యటన కు ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు

ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ (R. Marcos Jr) భారత్ లో పర్యటించనున్నారు. ఆగస్టు 4 నుంచి 8 వరకు పర్యటన కొనసాగనుంది. ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) ఆహ్వానం మేరకు ఆయన భారత్ (India ) కు వస్తున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు మార్కోస్‌తోపాటు ఆయన సతీమణి మడామే లూయిస్ ఆరనేటా మార్కోస్ (Madam Louise Araneta Marcos) కూడా భారత్‌కు రానున్నారు. వారితోపాటు పలువురు క్యాబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రతినిధులతో కూడిన ఉన్నతస్థాయి బృందం కూడా వారితోపాటు భారత్‌కు రానుంది. ఆగస్టు 8న బెంగళూరులో పర్యటించి ఫిలిప్పైన్స్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.