Siddaramaiah: దళితుడిని ప్రధాని చేయండి.. బీజేపీకి సిద్ధరామయ్య ఛాలెంజ్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. 75 ఏళ్లు నిండిన రాజకీయ నాయకులు పదవీ విరమణ చేయాలన్న భాగవత్ సూచనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. “ఆరెస్సెస్ సర్సంఘచాలక్ మోహన్ భాగవత్.. 75 ఏళ్ల నరేంద్ర మోడీ (Narendra Modi) రాజకీయ రిటైర్‌మెంట్‌పై పరోక్షంగా హింట్ ఇచ్చారు. ఇప్పుడు బీజేపీకి దళితుడిని ప్రధానిని చేసే సువర్ణావకాశం లభించింది. ఈ అవకాశాన్ని వారు తప్పకుండా ఉపయోగించుకోవాలి” అని సిద్ధరామయ్య అన్నారు. “ఇతరులకు ఉపన్యాసాలు ఇచ్చే బదులు, మీరే మార్పును ప్రారంభించవచ్చు. గోవింద్ కార్జోల్, చాలవాడి నారాయణస్వామి వంటి దళిత నాయకులను బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎందుకు ప్రపోజ్ చేయడం లేదు? మీరు గనుక ఈ పని చేస్తే, మిమ్మల్ని అభినందించే మొదటి వ్యక్తిని నేనే అవుతాను” అని బీజేపీకి సిద్ధరామయ్య (Siddaramaiah) సవాల్ విసిరారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర వెంటనే స్పందించారు. “కాంగ్రెస్ నిజంగా దళితుల పక్షాన నిలబడితే, మల్లికార్జున ఖర్గేను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలి” అంటే ప్రతి సవాల్ విసిరారు.