Seema Haider: నేను భారత్ కోడలిని.. నన్ను వెళ్లగొట్టొద్దు

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాక్ జాతీయులకు వీసా సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ దేశీయులకు జారీ చేసిన అన్ని వీసాలు 2025 ఏప్రిల్ 27 నుంచి రద్దు కానున్నాయని, ఈ గడువు ముగిసేలోగా వారంతా భారత్ (India)ను వీడివెళ్లిపోవాలని విదేశాంగ శాఖ ప్రకటించిది. ఈ నేపథ్యంలో పాక్ జాతీయురాలు సీమా హైదర్ (Seema Haider )ను దేశం నుంచి బహిష్కరిస్తారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందిస్తూ ..తనకు పాక్ వెళ్లే ఉద్దేశం లేదని, ఇక్కడే ఉండేందుకు అనుమతించాలని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), యూపీ సీఎం యోగిలకు విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు తాను పాకిస్థాన్ పౌరురాలు (Pakistani citizen) అయినప్పటికీ , ఇప్పుడు భారత్ కోడలినని దయ చేసి తనను ఆ దేశానికి పంపొద్దని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 2023లో తన ప్రియుడు సచిన్ మీనా (Sachin Meena)ను వివాహం చేసుకున్నప్పుడే తాను హిందూమతాన్ని స్వీకరించానని తెలిపింది.