Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌పై పార్లమెంటులో 32 గంటల చర్చ: కిరణ్ రిజిజు

పార్లమెంటులో ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)పై 32 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరగనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) వెల్లడించారు. సోమవారం లోక్‌సభలో 16 గంటలు, మంగళవారం రాజ్యసభలో 16 గంటలు ‘పహెల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) అంశాలపై విస్తృత చర్చ జరగనుందని ఆయన తెలిపారు. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని రిజిజు చెప్పారు. విపక్షాలు అనేక అంశాలపై చర్చ కోరినప్పటికీ, ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)కు తొలి ప్రాధాన్యం ఇవ్వడానికి అందరూ అంగీకరించారని మంత్రి వివరించారు. పార్లమెంటు సమావేశాలకు ముందే ఈ అంశంపై చర్చకు విపక్షాలు లేఖలు రాయగా, ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేసిందని ఆయన (Kiren Rijiju) గుర్తుచేశారు. అయితే, సమావేశాలు ప్రారంభమయ్యాక విపక్షాలు సభను అడ్డుకుంటున్నాయని, తొలి వారంలో కేవలం ఒక బిల్లు మాత్రమే ఆమోదం పొందిందని రిజిజు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఏ సమస్యపై అయినా ప్రశ్నలు లేవనెత్తవచ్చని, కానీ సభ కార్యకలాపాలను అడ్డుకోవడం సమంజసం కాదని ఆయన (Kiren Rijiju) స్పష్టం చేశారు.