Kangana Ranaut: ఎంపీగా ఉంటే మరో ఉద్యోగం అవసరం : కంగనా రనౌత్

రాజకీయాల్లో నిజాయితీగా పనిచేసే ఎంపీలకు జీతం సరిపోదని ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) పేర్కొన్నారు. తమతో ఉండే సిబ్బందికి జీతాలు ఇచ్చిన తర్వాత ఎంపీ (MP)లకు మిగిలేది అంతంతమాత్రమేనని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ప్రజాప్రతినిధులు, పీఏ (PA)లతో తమ నియోజకవర్గాలకు వాహనాల్లో వెళ్లేందుకు రూ.లక్షల్లో ఖర్చవుతుందని కంగనా పేర్కొన్నారు. నియోజకవర్గం (Constituency) లోని ఒక్కో ప్రదేశం 300-400 కి.మీ.ల దూరంలో ఉండటమే అందుకు కారణమన్నారు. కాబట్టి రాజకీయాలు ఖర్చుతో కూడుకున్నవని ఆమె అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఎంపీలకు వచ్చే జీతం సరిపోవట్లేదన్నారు. అందుకే మరో ఉద్యోగం (Job) చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే చాలామంది ఎంపీలకు వ్యాపారాలు ఉన్నాయని, మరికొందరు న్యాయవాదులు (Lawyers) గా ఉన్నారని తెలిపారు. ఎంపీగా ఉంటే మరో ఉద్యోగం అవసరం అవుతుంది కాబట్టి ఆ పదవిని వృత్తిగా తీసుకోలేమన్నారు.