Kamal Haasan: రాజ్యసభ సభ్యుడిగా కమల్‌హాసన్ ప్రమాణం
మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత, నటుడు కమల్‌హాసన్(Kamal Haasan) రాజ్యసభ సభ్యుడి గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ (Harivansh Narayan Singh) ప్రమాణం చేయించారు. తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎన్నికైన డీఎంకేకు చెందిన న్యాయవాది విల్సన్ (Wilson) , కవయిత్రి సల్మా ఎలియాస్ రాజాత్తి, ఎస్.ఆర్.శివలింగం (S.R. Shivalingam) కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో విల్సన్ రాజ్యసభకు మళ్లీ ఎన్నికయ్యారు. రాజ్యసభలో తమిళనాడు (Tamil Nadu) కు చెందిన ఆరుగురు సభ్యుల పదవీకాలం ఇటీవల ముగిసింది. దీంతో జూన్ 19న వారి స్థానంలో కమల్‌హాసన్ సహా ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.






