అంబానీ మరో సంచలన నిర్ణయం
ఆసియా కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో కీలక అడుగు వేయబోతున్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ంగ్కు సిద్ధమవుతున్నారు. మాతృ సంస్థ రిలయన్స్ గ్రూపు నుండి విడిపోయేందుకు ఇప్పటికే ఎన్సీఎల్టీ ఆమోదం పొందింది. రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (ఆర్ఎస్ఐఎల్) కొత్త ఈక్విటీ షేర్లను స్టాక్ ఎక్స్చేంజీలలో పొందేందుకు అర్హులైన కంపెనీ ఈక్విటీ వాటాదారులను నిర్ణయించే ఉద్దేశ్యంతో జూలై 20ని రికార్డ్ డేట్‌గా నిర్ణయించినట్లు తెలిపింది. ఈ మార్చిలో, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్ తన ఆర్థిక సేవల సంస్థను రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (ఆర్ఎస్ఐఎల్) లోకి విడదీసి, జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జెఎఫ్ఎస్ఎల్)గా పేరు మార్చాలని యోచిస్తున్నట్లు తెలిపింది. అలాగే హితేష్ కుమార్ సేథీ కొత్త సంస్థకు సీఎండీగా ఉంటారని కూడా ఆర్ఎస్ఐఎల్ ప్రకటించింది.






