NASA: త్వరలోనే అమెరికా మరో ప్రయోగం : నాసా

ఇటీవలే నాసా(NASA) భాగస్వామ్యంతో రూపొందించిన భూపరిశీలన ఉపగ్రహం నిసార్‌ను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చిన ఇస్రో, త్వరలోనే మరో అమెరికా ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమవుతోంది. 2 నెలల్లో అమెరికా (America) కు చెందిన 6,500 కిలోల కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ (V Narayanan) వెల్లడించారు. చెన్నై (Chennai) లోని కట్టంకులత్తూర్‌లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 34 దేశాలకు చెందిన 433 ఉపగ్రహాలను సొంత రాకెట్ల ద్వారా ప్రయోగించే స్థాయికి ఇస్రో ఎదిగిందని అన్నారు.