Kasturi Rangan: ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ చైర్మన్ డా.కృష్ణస్వామి కస్తూరిరంగన్ (Kasturi Rangan) బెంగళూరు లోని తన నివాసంలో కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడిరచారు. కస్తూరిరంగన్ 1990-1994 వరకు యూఆర్‌ఎసీ డైరెక్టర్ (Director of URAC) గా పనిచేశారు. అనంతరం ఆయన 9 ఏళ్లపాటు (1994-2003) ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలో ఇస్రో తొలి లూనార్ మిషన్‌కు అడుగులు పడ్డాయి. జేఎన్‌యూ ఛాన్సలర్ (JNU Chancellor)గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ చైర్మన్‌గా కస్తూరిరంగన్ పనిచేశారు. 2003`09 మధ్య రాజ్యసభ (Rajya Sabha ) సభ్యుడిగానూ ఉన్నారు. అంతేకాకుండా ప్రణాళిక సంఘం సభ్యుడిగానూ సేవలందించారు. అలాగే 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు. మోదీ సర్కార్ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశారు.